B Vinod Kumar : జీవో 97తో తుగ్లక్ రేవంత్రెడ్డి పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను గందరగోళంలోకి నెట్టాడని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. పది రోజులుగా విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలో తీసుకురావడం అన్యాయమని అన్నారు.
పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తేవడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు న్యాయమైన పోరాటం చేస్తున్నారని, వారి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుందని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ అనేది కేవలం డిగ్రీలు ఇవ్వడానికే పరిమితమని చట్టంలో పేర్కొన్నారని గుర్తుచేశారు. అలాంటప్పుడు డిప్లొమా కోర్సు అయిన పాటిటెక్నిక్ను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. అయినా ఈ నిమిషం వరకు కూడా స్కిల్ యూనివర్సిటీకి AICTE గుర్తింపు లభించలేదని చెప్పారు.
జీవో 97తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను గందరగోళంలోకి నెట్టిన తుగ్లక్ రేవంత్!
పది రోజులుగా విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్.
పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తేవడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్… pic.twitter.com/3WF0RCM68g
— BRS Party (@BRSparty) August 24, 2026