కొడిమ్యాల, నవంబర్ 10: ‘వరి ధాన్యా న్ని కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను నిలువునా ముంచుతున్నది. కేసీఆర్ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరిస్తే.. పదేండ్ల తర్వాత గ్రామాల్లో మళ్లీ దళారీ వ్యవస్థ మొదలైంది. కాంగ్రెస్ నాయకులకు ధాన్యం కొనుగోలు చే యడం చేతగాదు కానీ.. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన జగిత్యాల జిల్లా కొ డిమ్యాల మండలం నమిలకొండలోని ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మా ట్లాడుతూ.. నమిలకొండలోని కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. కేం ద్రంలో ధాన్యం పోసి, కొనుగోళ్ల కోసం రైతు లు పడిగాపులు కాస్తున్నారని, వెంటనే వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. రూ.500బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందని దుయ్యబట్టారు.