వరంగల్, నవంబర్ 5 : వరంగల్ భద్రకాళి ఆలయంలో(Bhadrakali Temple) నాణ్యతతో కూడిన ప్రసాదాల తయారీపై భారత ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థ ‘ఈట్ రైట్ ప్లేస్’ సర్టిఫికెట్ను( Eat Right Place Certificate) ప్రదానం చేసింది. ఆలయంలో ప్రసాదాల తయారీ, వంటశాలల పరిశుభ్రతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక సార్లు తనిఖీలు చేసిన అనంతరం ఇచ్చిన నివేదిక అధారంగా సర్టిఫికెట్ ప్రదానం చేశారు.
మంగళవారం హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ కార్యాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆలయ ఈవో శేషుభారతి అందుకున్నారు. కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ హరినాథ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
KCR | దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి.. నివాళులర్పించిన కేసీఆర్
Ex Minister Roja | ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి : మాజీ మంత్రి రోజా