కరీంనగర్ : వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ(Auto trolley) డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన కరీంనగర్(Karimnagar) జిల్లా హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామ స్టేజి వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కందుగుల గ్రామం నుంచి భీంపల్లి గ్రామానికి వరి నాటు వేయడానికి వెళ్తుండగా ఆటో అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది.
దీంతో ఆటో ట్రాలీలో ప్రయాణిస్తున్న కూలీలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | అదో లొట్టపీస్ కేసు.. వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు