హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఉచిత బస్సు స్కీంతో నష్టపోతున్న ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు తీరుకు నిరసనగా శుక్రవారం అసెంబ్లీ ముట్టడి చేపట్టనున్నట్టు ఆటో జేఏసీ నాయకులు మారయ్య, సత్తిరెడ్డి, వెంకటేశ్ పేర్కొన్నారు. హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్లు హైదరాబాద్‌కు తరలొచ్చి ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఏడాదికి రూ.12వేలు ఇస్తామని మాటిచ్చి అమలు చేయకపోవడం బాధాకరమని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్టీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సిటీ ఆటో యూనియన్, టీఎస్డీయూ తదితర సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో దుర్భర జీవితాలను గడుపుతున్న చెంచుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. భూపాలపల్లి, ములుగు, మంథని జిల్లాల్లోని చెంచులను కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు. వీరి జీవనం మిగితా ప్రాంతాల గిరిజనులతో పోలిస్తే దారుణంగా ఉన్నది.
ఏ పథకమూ అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసిందని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. నిబంధనలను బుల్డోజ్ చేసుకొంటూ సభ నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్టీఆర్ ఘాట్ జోలికొస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఘాట్‌ను తొలగిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గోపీనాథ్ పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీఏలను బలోపేతం చేయాలి. 170 యాక్ట్‌ను మైదాన ప్రాంతాల్లో వర్తింపచేస్తారా? కొత్తగా 5 ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వ దవాఖానల్లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను నియమించాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను పెంచాలి.
అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.18 వేల చొప్పున పెంచాలి. గత 4 నెలలుగా నిలిచిన వేతనాలను వెంటనే వారికి విడుదల చేయాలి.
దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ 8,7తోపాటు పలు పనులకు సంబంధించి జనగామ జిల్లా పరిధిలో కేవలం 490 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉందని, అందుకు అవసరమైన రూ.178కోట్లు విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కల్వల ప్రాజెక్టు పునరుద్ధరణకు 70కోట్లు విడుదల చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కోరారు.
డీలర్లకు క్వింటా బియ్యానికి రూ.140 కమీషన్ చెల్లిస్తున్నారని, దాన్ని రూ.300కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి గుర్తుచేశా రు. దుకాణాల నిర్వహణకు అదనంగా నెలకు 5 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.