యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు(Auto drivers Suicide) కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు స్కీం(Free bus schemem) ఆటో డ్రైవర్లపాలిట (Auto Driver) శాపంగా మారింది. గిరాకీలేక.. బతుకుదారి కనిపించక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు (Committed suicide) పాల్పడుతుండటంతో వారి కుటుంబాలు రోడ్డునపడు తున్నాయి. చేసిన అప్పులు కట్టలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri)జిల్లాలో మరో ఆటో డ్రైవర్ మృతి చెందాడు.
ఈ విషాదకర సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలో(Bhudan Pochampally) చోటు చేసుకుంది. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన రావుల నగేష్ (35) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, ఆటోకి గిరాకీ లేక అప్పుల బాధ భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నగేష్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.