చిన్నశంకరంపేట, జూన్ 12 : ఆటో సరిగ్గా నడవక కొద్దిరోజులు దిగులుతో ఉన్న ఆటోడ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజన తండాకు చెందిన హలావత్ యాదగిరి(36) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో నడవడంలేదు. ఆటోపై తీసుకున్న ఫైనాన్స్ కట్టలేక కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమం లో గురువారం గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య నీల, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.