హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహాలక్ష్మి’ ప థకంతో ఉపాధి కరువై.. బతుకు భార మై మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్లాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం.. మల్లాపూర్‌లో నివాసముండే పత్లావత్ వీరేశ్(31) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రభుత్వ నిర్వాకంతో ఆటో గిరాకీ తగ్గి ఆర్థిక సమస్య లు తలెత్తాయి. కాగా శుక్రవారం వీరేశ్‌ను ఫైనాన్స్ డబ్బులు ఎప్పుడిస్తావంటూ కొంతమంది దుర్భాషలాడారు. దీనికితోడు పిల్లల ఫీజులు కట్టలేకపోయానని కలతచెందిన వీరేశ్ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇప్పటివరకు 60 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని బీఆర్టీయూ నాయకులు వాపోయారు.