శివ్వంపేట, మే 3 : అప్పులు పెరిగి మనోవేదనకు గురైన ఆటోడ్రైవర్ సెల్ఫీ తీసుకుంటూ పరుగుల మందు తాగిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేటలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన కంచాన్పల్లి శేఖర్ అవసరాల కోసం రూ.20లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో హైదరాబాద్కు మూడేండ్ల క్రితం వలసవెళ్లి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. కొత్తపేట మీదుగా పోతున్న ట్రిపుల్ ఆర్ రోడ్డులో 25 గుంటల వరకు శేఖర్ భూమి పోతున్నది.
నష్టపరిహారం ఇస్తే తన అప్పులు తీర్చుకుందామనుకున్న శేఖర్ పరిహారం రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడి యో తీసుకుని ఆత్మహత్యకు యత్నిం చాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఓవైపు వర్షాలు కురుస్తున్నా పలు చోట్ల తాగునీటికి జనం తండ్లాడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ కొత్తకాలనీ వాసులు ఏకంగా వాటర్ట్యాంక్పైకి ఎక్కి నీళ్లు తెచ్చుకున్నారు. సోమవారం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ యంత్రాలు శుద్ధి చేయడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మంగళవారం నీళ్ల కోసం స్థానికులు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి అడుగున ఉన్న కొద్దిపాటి నీటిని తెచ్చుకున్నారు.
– ధరూరు