హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాత్రను నా మమాత్రం చేసేందుకు ప్రయత్నించిన మంత్రులు జూపల్లి కృష్ణారా వు, సీతక్క తీరుపై బీఆర్ఎస్ ఎ మ్మెల్సీలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తంచేశా రు. మంత్రి బడ్జెట్‌పై కాకుండా ఇతర విషయాలను ప్రస్తావిస్తున్నారంటూ అభ్యంతరం తెలిపారు. మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ సభ్యులు అసందర్భంగా మాట్లాడవద్దని డిమాండ్ చేశారు.
శాసనమండలిలో శుక్రవారం బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ పక్ష నాయకుడు మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణలో సాధనలో కేసీఆర్ పాత్రను, ఆ తర్వాత రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని కొనియాడారు. దీనిపై మంత్రి జూపల్లి స్పందిస్తూ తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను కాదనలేమని, అయితే విద్యార్థుల ఆత్మబలిదానాల వల్లనే తెలంగాణ వచ్చిందని అన్నారు. అంతకుముందు మంత్రి సీతక్క కూడా ఇదే విధంగా మాట్లాడారు. వారి వ్యాఖ్యలపై కొద్దిసేపు సభలో దు మారం రేగింది. బీఆర్ఎస్ సభ్యు లు మధుసూదనాచారి, కవిత తదితరులు ఒక్కసారిగా లేచి నిరసన తెలిపారు. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జోక్యం చేసుకొని ఇరువర్గాలను వారించే ప్రయత్నం చేశారు. అయినా విమర్శలు, ప్రతి విమర్శలు ఆగలేదు. దీంతో చైర్మన్ మంత్రి మైక్ కట్‌చేసి ఆయనను కూర్చోవాలని చెప్పా రు. అనంతరం బడ్జెట్‌పై మాట్లాడాలని కాం గ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో గందరగోళం సద్దుమణిగింది.