మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 12:51:15

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడి అమానుషం : మంత్రి కొప్పుల

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడి అమానుషం : మంత్రి కొప్పుల

పెద్దపల్లి : దళిత వర్గానికి చెందిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వీరేశంలపై బీజేపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మంగళవారం జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకులు, ప్రజల పట్ల బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇది బీజేపీ పార్టీకి దళిత వర్గాలపై ఉన్న వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాల్సిందిగా డీజీపీ మహేందర్ రెడ్డిని మంత్రి కోరారు.