వరంగల్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులను మోసం చేసిన ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బీజేపీ అబద్ధాలు చెప్పి కేంద్రంలో, బోగస్ మాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభు త్వం రైతుబంధు ఇవ్వడంలేదని, పంట రుణాలను మాఫీ చేయలేదని, యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లలో పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌తో కలిసి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం ఎనుమాముల మార్కెట్లో రైతులతో మాట్లాడా రు. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న మిర్చి రైతుల కష్టాలు విని, రైతులకు బీఆర్ఎస్ అం డగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంత రం మీడియాతో మాట్లాడారు. గతంలో మిర్చి క్వింటాలుకు రూ.25వేల నుంచి 30 వేలు ధర పలికిందని, ఈసారి ధర సగానికి పడిపోయిందన్నారు. క్వింటాకు రూ.25 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.