ASHA Workers | సుల్తాన్‌బజార్, జూన్ 15: రాష్ట్రంలోని ఆశవర్కర్లకు రూ.18 వేల చొప్పున వేతనాన్ని అమలు చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ఎస్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశ) సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీన ఆశ వర్కర్లకు ప్రభుత్వమే వేతనాలు ఇవ్వాల ని, కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీ మేరకు ఉ ద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశా రు. అర్హత కలిగిన ఆశలకు ఏఎన్ఎం, జీఎన్ఎం ఉద్యోగాల్లో ఆవకాశం కల్పించాలని, ప్రమా దం జరిగినా, సహజ మరణం పొందినా ఎక్స్‌గ్రేషియా అందజేయాలని, హెల్త్‌కార్డుతో కూడిన జాబ్‌చార్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ధర్నాలో పాల్గొన్న ఆశ కా ర్యకర్తలు ఒక్కసారిగా డీఎంఈ వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని అడ్డుకొని సముదాయించారు. అనంతరం కుటుంబ వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయంలోని హెల్త్ న్యూట్రిషన్ జేడీ పద్మజకు వినతి పత్రాన్ని అందజేశారు.
కనీస వేతనాల మాజీ చైర్మన్ నారాయ ణ, బీఆర్టీయూ కార్యదర్శి మారయ్య, రూప్సింగ్, తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ సంతోషి, ప్ర ధాన కార్యదర్శి కరుణ, సభ్యులు లక్ష్మి, రేణు క, విజయ, అనిత, రాణి, అపర్ణ, సమతా, పుణ్యవతి, రేణుక, మంజుల, స్వరూప, రబి యా, యాదమ్మ, మాధవరెడ్డి పాల్గొన్నారు.