బీఆర్ఎస్ వీడను, బీజేపీలో చేరను : ఆశన్నగారి జీవన్‌రెడ్డి
తాను బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి, బీజేపీలోకి వెళ్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు.
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 22: తాను బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి, బీజేపీలోకి వెళ్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ వీడను, బీజేపీ సహా మరే పార్టీలో చేరనని స్పష్టంచేశారు. కంఠంలో ప్రాణమున్నంత వరకు కేసీఆర్ బాట వీడనని, చివరివరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని చెప్పారు. తన రాజకీయ గురువు, ఆరాధ్య దైవం కేసీఆర్ అని తెలిపారు.
రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే ఈ దుష్ప్రచారం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీలో చేరడానికి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలో కలిసినట్టు కట్టు కథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏ మంత్రిని కలువలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఫేక్ ప్రచారాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

