హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి సవాల్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీచేయాలన్నారు. అప్పుడు ఎంఐఎం (MIM) సత్తా ఏంటో చూపిస్తామని ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆ పార్టీ నాయకులు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. ఎంఐఎం డబ్బులు తీసుకుని బీజేపీ కోసం పనిచేస్తున్నదని, కాంగ్రెస్‌ను ఓడించడానికి దేశవ్యాప్తంగా పోటీచేస్తున్నదని రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. దానికి ప్రతిగా తాము యూపీఏకు మద్దతు ఇవ్వడానికి ఎంత డబ్బు ఇచ్చారని అసదుద్దీన్ కౌటర్ ఇచ్చారు. 2008లో జరిగిన న్యూక్లియర్ డీల్‌లో మద్దతు ఇచ్చినందుకు ఎన్ని డబ్బులు తీసుకున్నా? రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు ఇచ్చినందుకు ఎంతిచ్చారని రాహుల్ గాంధీని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
తాజాగా, రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో పోటీచేయాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు. తమని బీ టీమ్ అని పిలిస్తే.. మరి మీరు ఎవరి జట్టని ప్రశ్నించారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్‌కు మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పతనానికి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు.
#WATCH | On Congress MP Rahul Gandhi, AIMIM MP Asaduddin Owaisi says, “…If you call (us) B team, then should I say from which team you are?… I say to Rahul Gandhi, come to Hyderabad and compete with me in parliament elections…”(02.11) pic.twitter.com/K0NLRRQw1a
— ANI (@ANI) November 3, 2023