హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థల్లో పనిచేసే కార్మికలో కం కదంతొక్కింది. రెగ్యులరైజ్ సహా ఆరు ప్ర ధాన డిమాండ్లు సాధించుకునేందుకు కార్మికు లు బుధవారం నిరవధిక సమ్మెకు దిగి జంగ్ సైరన్ మోగించారు. మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులు స్వచ్ఛందంగా విధుల ను బహిష్కరించారు. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రా లు, సర్కిల్, డివిజన్ కార్యాలయాల ఎదుట దీక్షల్లో పాల్గొన్నారు. ట్రాన్స్‌కో, జెన్కో, ఉత్తర డిస్కమ్, దక్షిణ డిస్కమ్‌లో పనిచేసే కార్మికులు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. తొమ్మిది కార్మిక సంఘాలు ఏకమై, జేఏసీగా ఉద్యమానికి శ్రీకారం చుట్టగా, ఇతర కార్మిక సంఘా లు, ఇంజినీర్ల సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ‘ఆర్టిజన్ వద్దు.. కన్వర్షన్ ముద్దు’.. ‘విద్యుత్తు సంస్థల యాజమాన్య మొండివైఖరి నశించాలి’ అంటూ నినదించారు. దీంతో విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు, పలు కార్యాలయా ల్లో సేవలకు అంతరాయం కలిగింది.
ఆర్టిజన్ల సమ్మెను నిలువరించేందుకు ప్రభు త్వం ఎస్మా అస్ర్తాన్ని ప్రయోగించి కార్మికులను భయపెడుతున్నది. ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధించింది. ఈ మేరకు దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేష్ వీ పాటిల్ ఉత్తర్వులివ్వడంపై ఆర్టిజన్ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే అరెస్టులు, బెదిరింపులతో సమ్మె ను నిలువరిస్తారన్న భయంతో ఆర్టిజన్ జేఏసీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రెండు, మూడు రోజుల ముందే కొందరు కీలక నేతలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లారు. బుధవారం కొత్తగూడెం ప్లాంట్‌కు చేరుకొని సమ్మెను ప్రారంభించారు.
నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 8 : ఆర్టిజన్ల సమ్మె తొలి రోజు విజయవంతమైంది. రాష్ట్రంలోని విద్యుత్తు ఉత్పత్తిప్లాంట్లలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొత్తగూడెం థర్మల్‌ప్లాంట్‌లో పనిచేసే 2వేల మంది కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. భూ పాలపల్లిలోని కాకతీయ థర్మల్‌ప్లాంట్‌లో 400మంది కార్మికులు సమ్మెకు దిగారు. వి ద్యుత్తు సౌధ, ఉత్తర డిస్కమ్, దక్షిణ డిస్కమ్ కార్యాలయాల్లో పనిచేసే ఆర్టిజన్లు సైతం విధులను బహిష్కరించి దీక్షలకు దిగారు. శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో 95మంది, జూరాలలో 40మంది జల విద్యుత్తు ప్లాంట్లలోని కా ర్మికులు సైతం సమ్మెలోకి వెళ్లారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్లు, సబ్స్టేషన్ల నిర్వహణ చూసే కార్మికులు, క్షేత్రస్థాయిలో మరమ్మతులు చేసే ఫ్యూ జ్ ఆఫ్ కాల్(ఎఫ్‌వోసీ) కార్మికులు, సిబ్బంది సైతం విధులు బహిష్కరించారు.
డిస్కమ్‌లు, విద్యుత్తు సౌధ కార్యాలయాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు సైతం సమ్మెలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లోని 11 డివిజన్ల పరిధిలోని ఆర్టిజన్లు, ఆన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్, పీస్‌రేట్ వ ర్కర్లు, బిల్కలెక్టర్లు అందరూ విధులు బహిష్కరించి దీక్షలో పాల్గొన్నారు. హనుమకొండ న కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ సరిల్ కార్యాలయం ఆవరణలో నిరసన శిబిరం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ రావుల రమణారెడ్డి సంఘీభావం తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లకు ఒకే సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, అర్హతనుబట్టి రెగ్యులర్ ఉద్యోగులు కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ములుగు రోడ్డు పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్‌కో జోనల్ కార్యాలయం వద్ద నిరసనలో టీఆర్వీకేఎస్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్‌రెడ్డి పాల్గొని సమ్మె కు సంఘీభావం తెలిపారు. భూపాలపల్లిలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని సబ్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. భూపాలపల్లిలోని కాకతీయ థ ర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రధాన గేటు ఎదుట ధ ర్నా చేయగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ సతీశ్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్, చింత ఎల్లయ్య, ప్రశాంత్ పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో సమ్మెకు ది గారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఖమ్మం నగరంలో, మధిర, సత్తుపల్లి మండలకేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాలు, సబ్స్టేషన్ల ఎదుట సమ్మె చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ సాయిలు, కో కన్వీనర్ చంద్రసింగ్ ఠాగూర్, బాలకృష్ణారెడ్డి, వెంపటి అనిల్‌కుమార్, రవీందర్, నర్సిరెడ్డి, జేఏసీ మధిర డివిజన్ చైర్మన్ సీహెచ్ రామకృష్ణ, సత్తుపల్లి డివిజన్ టీవీఏఈ జేఏసీ చైర్మన్ జి.రాందాస్‌నాయక్ పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంటలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం(టీజీ) ఎదుట ఎస్‌ఎల్‌బీహెచ్‌ఈఎస్ ఆర్టిజన్స్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె చేపట్టారు. ప్రభుత్వం తమకు తగిన గౌరవం, హక్కులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే నిజామాబాద్, బోధన్, ఎల్లారెడ్డి, తదితర ప్రాంతాల్లో సమ్మె సక్సెస్ అయ్యింది.
విద్యుత్తు సంస్థల్లో క్షేత్రస్థాయి ఉద్యోగులంటే ఆర్టిజన్లే. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరాలో వీరే అత్యంత కీలకం. కార్మికులు సమ్మెకు దిగడంతో కొత్తగూడెం థర్మల్ప్లాంట్లోని అన్ని యూనిట్లల్లో ప్రభావం స్పష్టంగా కనిపించింది. భూపాలపల్లి థర్మల్‌ప్లాంట్‌లో పోగయ్యే బూడిదను తొలగించడం సమస్యగా మారింది. రెండు రోజులు ఇలాగే ఉంటే ప్లాంట్లు నడిచే పరిస్థితి ఉండదన్న వాదనలున్నాయి. మ్యాన్‌పవర్ తగ్గడం, కార్మికుల కొరత సమస్యలతో అధికారులకు తలనొప్పులు తప్పడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా సరిపడా కార్మికులు దొరకడం లేదు. అయితే ఎండలు మండిపోతుండటంతో విద్యుత్తు వినియోగం పెరుగుతున్నది. అటు సమ్మె.. ఇటు ఏదో సమస్య తలెత్తితే ఇబ్బందులు తప్పవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జనరేటింగ్ స్టేషన్లు మొదలు సబ్స్టేషన్ల వరకు కార్మికులంతా సమ్మెకు వెళ్లడంతో విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని, గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.