హైదరాబాద్ : హైదరాబాద్ నగరం(Hyderabad) మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. జులై 8,9 తేదీల్లో అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సు(Artificial Intelligence Conference) నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హెచ్ఐసీసీలో(Hicc) అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సదస్సును నిర్వహిం చనున్నారు. కృత్రిమ మేధపై అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు.