కరీంనగర్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) /హుజూరాబాద్ : బీజేపీ (BJP) ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య వర్గపోరు నడుస్తుందన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికలైనా, ఏ సమావేశం జరిగినా హుజూరాబాద్ (Huzurabad) అసెంబ్లీ నియోకజవర్గంలో వర్గ విభేదాలు రచ్చకెక్కడం చూస్తున్నదే. కొంతకాలంగా ఎంపీలు ఈటల, బండి మధ్య రగులుతున్న వివాదం, పంచాయతీ ఎన్నికల్లో మరింత బట్టబయలైంది. పోటాపోటీగా అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం చేయడంతోపాటు ప్రచార సమయంలో ఒకరికి ఒక రు అడ్డు కట్టవేసుకునేందుకు చేసిన ప్రయత్నా లు పార్టీ నాయకులపాలిట శాపాలుగా మారా యి. ప్రధానంగా ఈటల సపోర్టు తీసుకోవద్దని చెప్పిన బండి వర్గం అభ్యర్థులకు డబ్బుల ఆశ చూపించినట్టు ప్రస్తుతం సోషల్ మీడియా సాక్షిగా ఓటమిపాలైన అభ్యర్థుల ఆవేదనలో అర్థమవుతున్నది. గడిచిన రెండు రోజులుగా సోషల్‌మీడియా వేదికగా జరిగిన మోసాన్ని ఎండగడుతున్న తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
రచ్చకెక్కిన వర్గపోరు
బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్ వర్గపోరు రోడ్డున పడింది. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈటలకు అడ్డుకట్టవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హుజూరాబాద్‌లోని ఓ ప్రైవే టు గార్డెన్లో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి పరోక్షంగా రాజేందర్‌ను ఉద్దేశించిన మాట్లాడిన మాటలు పార్టీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈటల రాజేందర్ మరుసటి రోజే కమలాపూర్‌లో పార్టీ అనుచరవర్గంతో సమావేశం నిర్వహించి ఘాటుగానే మాట్లాడారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో ఇరు వర్గాల మధ్య కనిపించని యు ద్ధమే జరిగింది, పార్టీ క్యాడర్ ఇబ్బందిపడ్డారు.
వంచన చేశారంటూ నేతలు బయటికి
ఎన్నికల్లో డబ్బులు ఇస్తామని, నమ్మించిన నయవంచన చేశారంటూ ఓటమి పొందిన అ భ్యర్థులు ఒక్కొక్కరిగా బయట పడుతున్నారు. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన బేతి సులోచన భర్త తిరుపతిరెడ్డి సోషల్ మీడియా సాక్షిగా ఈ నెల 18న ఆవేదన వ్యక్తం చేసిన తీరు పార్టీలో దుమారమే రేపింది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు కుమార్ తన దగ్గరికి వచ్చి ఈటల రాజేందర్ మద్దతు తీసుకుంటే మంచిగుండదని, మీకేమై న అవసరముంటే పార్టీపరంగా చూసుకుంటామని హామీ ఇచ్చారని పోస్టులో పేర్కొన్నారు. వాళ్ల మాటలు నమ్ముకొని బరిలోకి దిగామని, తీరా సమయానికి మాకు ఎలాంటి సహాయం అందివ్వలేదని వాపోయారు.
తిరుపతిరెడ్డి పోస్టు పెట్టిన కొద్దిసేపటికే హుజూరాబాద్ మం డల పార్టీ అధ్యక్షుడు రాముల కుమార్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పైనుంచి డబ్బులు రాకపోవడంతో ఇచ్చిన మాట ప్రకారం అభ్యర్థులకు డబ్బులు ఇవ్వలేకపోయానని, ఓటమి పొంది న అభ్యర్థులు అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెపుతామనే ఆవేదనను కుమార్ సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. పెద్దపాపయ్యపల్లెలో బీజేపీ నుంచి పోటీచేసి ఓటమి పొందిన సైన్యం వెంకటస్వామి నమ్మి మోసపోయిన తీరును సోషల్ మీడియావేదిక గా పోస్టుచేయడం కలకలం రేపుతున్నది. నిజానికి ఇది ఒకరిద్దరి ఆవేదన మాత్రమే కాదు, ఇంకా చాలామంది బాధితులున్నారన్న చర్చ ప్రస్తుతం పార్టీలో నడుస్తున్నది. ఇలాంటి పరిస్థితులపై అధిష్టానం ఏమైనా స్పందిస్తుందా.. లేదా..? అన్నది చూడాలి.
నేను చనిపోతే బండి సంజయే బాధ్యత వహించాలి
నా పేరు సైన్యం వెంకటస్వామి. గ్రామం పెద్దపాపయ్య పల్లె. హుజూరాబాద్ మండ లం కరీంనగర్ జిల్లా. బీజేపీ అంటే అభిమానంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేశాను. వార్డ్మెంబర్గా చేసిన అనుభవంతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేశా. గ్రామంలో బీజేపీ నాయకులు, కార్యకర్తల ఇండ్లకు వెళ్లి సపోర్టు చేయాలని కోరా. ఏ ఒక్కరూ సహకరించలేదు. ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్లి సపోర్ట్ చేయాలని అ డగ్గా, సపోర్టు చేస్తానని మాటిచ్చారు, రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నాడు. విష యం తెలిసిన కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రాముల కుమార్, కరీంనగర్ జిల్లా మాజీ కార్పొరేటర్, మరో ఇద్దరు ముగ్గురు మా ఇంటికి వచ్చి రాజేందర్ సపోర్ట్ తీసుకోవద్దని బెదిరించారు. అన్నీ చూసుకుంటామని బండి సంజ య్ చెప్పినట్టు వింటే సహా యం చేస్తామని చెప్పారు.
రూ.7 నుంచి 8 లక్షలు ఇస్తామన్నారు, నేను కూడా సరే డబ్బులు ఇవ్వండని కోరారు. ముందుగా నీ దగ్గర ఉన్న పైసలు ఖర్చు పెట్టు. మేం ఎన్నికలు సమీపించే వరకు ఇస్తామని నమ్మబలికారు. దీంతో దొరికినకాడల్లా అప్పులు చేసి ఖర్చు చేశా. ఎన్నికల ముందు రోజు కాదు కదా.. ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. అటు ఈటల, ఇటు బండి కొట్లాటపెట్టుకుని నాలాంటి బక్క పేదోళ్ల కాళ్లు విరగ్గొడుతున్నా రు. బండి సంజయ్ మధువన్ గార్డెన్లో మీటింగ్ పెట్టి మాటిచ్చినందుకే సర్పంచ్‌గా పోటీ చేసి ఖర్చుపెట్టా. ఇప్పుడు చేతులెత్తే శారు. పైసలివ్వకుంటే మేమంతా ఉరి వేసుకునే పరిస్థితి.. అప్పుల పాలైన నేను చనిపోతే బండి సంజయ్ బాధ్యత వహించాలి.
– వెంకటస్వామి,ఓటమి పొందిన బీజేపీ మద్దతు అభ్యర్థి