Heart Stroke | డోర్నకల్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని యాదవ్ నగర్‌కు చెందిన ఆర్మీ జవాన్ కొదిరిపాక సతీశ్(34) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీశ్ తండ్రి కనకయ్య చిన్నతనంలో మృతి చెందగా, తల్లి ఎల్లాబాయి అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నది. సతీశ్ డోర్నకల్‌లో 10వ తరగతి వరకు, ఖమ్మంలో పైచదువులు చదివాడు.
ఆర్మీలో ఉద్యోగం సాధించాలని పట్టుదలతో చదివి 2011లో ఎంపికయ్యాడు. నాలుగేళ్ల క్రితం నర్సంపేటకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. కలకత్తా ఆర్మీ బేస్ క్యాంపులో ఉద్యోగం చేస్తూ మంగళవారం గుండెపోటు రావడంతో పశ్చిమబెంగాల్ బాగ్ దోగారా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సతీశ్ మృతితో కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగారు. ఆయన మృతదేహం 29వ తేదీ సాయంత్రం రానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Jeevan Reddy | ఇది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన : మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
Ayyappa Devotees | వెల్లివిరిసిన మతసామరస్యం.. అయ్యప్ప మాలధారులకు ముస్లింల భిక్ష
SSC Exams | ఇకపై 100 మార్కులకు పదో తరగతి పరీక్షలు