హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : కొత్త మెడికల్ కాలేజీలు(అండర్ గ్రాడ్యువేట్-యూజీ), ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో యూజీ సీట్ల పెంపునకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) శుక్రవారం కోరింది.
ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ ఫిబ్రవరి 3 అర్ధరాత్రి 12 వరకు యాక్టివ్గా ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాల హెల్త్ సెక్రటరీలు, డీఎంఈలు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు సమాచారం అందించింది.