హైదరాబాద్, డిసెంబర్15 (నమస్తే తెలంగాణ): సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 5వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గురుకులాల్లో ఉన్న ఖాళీల భర్తీకి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
విద్యార్థులు ఆన్లైన్లో రూ.100 ఫీజు చెల్లించి జనవరి 21వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని వెల్లడించారు. ఫిబ్రవరి 22న రాష్ట్రవ్యాప్తంగా రాత పరీక్ష ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపారు. వివరాలకు www.tgcet.cgg.gov.in వెబ్సైట్ సందర్శించాలని, 040 23391598, 9491063511, 040 23328266, 24734899 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.