Kodangal | కొడంగల్, మే 30 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ శివారులో మెడికల్ అండ్ వెటర్నరీ కళాశాల నిర్మాణం కోసం 60 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. మెడికల్ కాలేజీకి కేటాయించిన భూమిలో స్మశానవాటిక ఉందని, ఊరికి స్మశానం లేకపోతే ఎలా అంటూ గ్రామస్తులు నిలదీశారు. స్మశానవాటికకు 5 ఎకరాలను కేటాయించిన తరువాతనే కాలేజీ నిర్మాణం మొదలుపెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
అప్పాయిపల్లి గ్రామ సమీపంలో నీ 19 సర్వే నెంబర్లో మెడికల్ అండ్ వెటర్నరీ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న 60 ఎకరాలలో భూమిలో మెడికల్ కళాశాల భూమికి ఆనుకొని స్మశాన వాటిక ఉంది. స్మశాన వాటికకు ప్రత్యేకంగా ఐదు ఎకరాలు కేటాయించిన తర్వాతనే మెడికల్ కళాశాల పనులు ప్రారంభించాలని మెడికల్ కళాశాల పనులకు గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రస్తుతం స్మశాన వాటిక గ్రామానికి ఆనుకుని ఉందని మున్ముందు గ్రామం మరింత విస్తరించినప్పుడు స్మశాన వాటిక ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ శివారులో మెడికల్ & వెటర్నరీ కళాశాల నిర్మాణం కోసం 60 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం
మెడికల్ కాలేజ్ భూమిలో స్మశానవాటిక ఉందని, ఊరికి స్మశానం లేకపోతే ఎలా… pic.twitter.com/otPTP6sjvg
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2025