ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 19:49:36

తెలంగాణ‌, ఏపీ నీటి వివాదాల‌పై ఆగ‌స్టు 5న‌ అపెక్స్ కౌన్సిల్ భేటీ

తెలంగాణ‌, ఏపీ నీటి వివాదాల‌పై ఆగ‌స్టు 5న‌ అపెక్స్ కౌన్సిల్ భేటీ

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెల‌కొన్న‌ నీటి వివాదాలపై చ‌ర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ ఆగస్టు 5వ తేదీన సమావేశం కానుంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించ‌నున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం క్రింద ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ రెండవసారి ఆగ‌స్టు 5 న  సమావేశం అవుతుంది. కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (కెఆర్‌ఎమ్‌బి), గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (జిఆర్‌ఎమ్‌బి) కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించడానికి కేంద్ర మంత్రిత్వశాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ భేటీ మే నెల‌లో జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడింది.

నూత‌న ప్రాజెక్టుల ప్రాజెక్టు నివేదిక‌ల‌ను కృష్ణా, గోదావ‌రి రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్టుల‌కు అంద‌జేయాల్సిందిగా అపెక్స్ కౌన్సిల్ ఇరు రాష్ర్టాల‌కు ఆదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ, గోదావరి నదీ జలాల వాటాను నిర్ణయించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై ఈ సమావేశం చర్చించనున్న‌ట్లుగా స‌మాచారం. 


logo