జగిత్యాల, ఆగస్టు 20: వైద్యారోగ్య శాఖ సరఫరా చేస్తున్న మందుల విషయంలో వింత ఘటన గురువారం వెలుగుచూసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్రిటికల్ కేర్ దవాఖానలో ‘ఫ్రామిసెటిన్’ స్కిన్ ఆయింట్మెంట్లపై ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సరఫరా’ అని ముద్ర ఉండటంతో రోగులతోపాటు అంతా ఆశ్చర్యపోయారు. క్రిటికల్ కేర్ తెలంగాణ దవాఖానకు ఏపీ సరార్ ముద్ర ఉన్న మందులు రావడం చర్చనీయాంశమైంది.
ఇది ప్యాకేజింగ్ లోపమా? అంతర్రాష్ట్ర స్టాక్ బదిలీనా? అన్న సందేహాలు తలెత్తాయి. ‘ఏపీ మందులు ఎలా వచ్చాయి?’ అని క్రిటికల్ కేర్ వైద్యాధికారులను వివరణ కోరితే, తెలంగాణ కోసం ప్యాకింగ్ చేసిన మందులు ఏపీ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన మందులు తెలంగాణకు వచ్చాయని తెలిపారు.