Singireddy Niranjanreddy | కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలువునా దోచుకుంటోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాన భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు. ఒకవైపు శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 854 లెవల్లో గేట్లు తెరిస్తే పోతిరెడ్డి పాడు, పక్కన మల్యాల, హంద్రినీవా ఇది ఒక సిస్టమ్.. మరోవైపు అదే శ్రీశైలం ప్రాజెక్టులో 840 అడుగుల వద్దే ఒక టన్నెల్ 19.2 కిలోమీటర్ల టన్నెల్‌ను తవ్వి ముందుకు తీసుకొని పోయి రిజర్వాయర్‌ను కట్టారు. దాని పేరు నల్లమల సాగర్ అని అన్నారు.
43 టీఎంసీల యూజబుల్ వాటర్ అని వాళ్లు లెక్క చెబుతున్నరు. కానీ అది 53 టీఎంసీల రిజర్వాయర్. కట్టేశారు.. టన్నెల్స్ అయిపోయాయి. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్ దగ్గర ఉండేట్వంటి అప్రోచ్ కెనాల్ అక్కడుండే గేట్లు తెరిస్తే చాలు.. శ్రీశైలం నీళ్లు 854 లెవల్ పోతిరెడ్డిపాడు అయిపోగానే.. శ్రీశైలం 854 లెవల్‌కు డౌన్ అయింది అంటే 840 లెవల్లో ఉండే వెలిగొండ రిజర్వాయర్ ద్వారా నీళ్లు తీసేస్తరు. నాలుగున్నర లక్షల ఎకరాల కోసం ప్రకాశం జిల్లా మార్కాపురం ఏరియా, నెల్లూరు, కడప జిల్లా కలిపి 33 మండలాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు ఉద్దేశించినట్వంటి ఈ వెలిగొండ ప్రాజెక్టును ఆగస్టు 31న వాళ్లు ప్రారంభోత్సం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నరు. ఎక్కడ పడుకుంటున్నవ్ రేవంత్ రెడ్డి.. ఎక్కడున్నవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఏం చేస్తున్నరు మీరు.. ? అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
ఉన్న నీళ్లు నల్లగొండకు, పాలమూరుకు ఇయ్యనీకే చేతనైతలేదు. పాలమూరు-రంగారెడ్డి తయారై ఉన్న సిస్టమ్‌ను ఆపరేట్ చేయడానికి చేతనైతలేదు మీకు.. మిగిలిన పనులు పూర్తి చేయనీకి చేతనైత లేదు. అది కూడా మనం దిగువన పెట్టిన వనరు. వాళ్లకు 854 లెవల్, 840 లెవల్ వచ్చే కంటే ముందే 802లో ఉండే సిస్టమ్‌ను వాడుకునేట్వంటి తెలివిలేని, చేతగాని అసమర్థ ప్రభుత్వం ఇదన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అసమర్థత ముఖ్యమంత్రి, అసమర్థ సాగునీటి మంత్రి, జిల్లా మంత్రులకు సోయే లేదు.. ఈ విషయాల మీద అవగాహనే లేదు. వీళ్లు శ్రీశైలం దగ్గరకు పోయి ధర్నా చేస్తరట. మీళ్లు ఒక ప్రభుత్వంగా చేయాల్సింది ఏది.. ఏపీ ప్రభుత్వం ఆగడాల మీద కేంద్ర జలశక్తి దగ్గరనో, కృష్ణా వాటర్ బోర్డు మేనేజ్మెంట్ దగ్గరనో చట్టపరంగా అవసరమైతేనో మీరు ఆందోళన చేయాలి కదా.. మీ ఆందోళ రికార్డు చేయాలి కదా అన్నారు.
ఇది కాకుండా ప్రభుత్వంలో ఉండే మంత్రి అక్కడికి పోయి ధర్నా చేస్తడట. పిల్లను సంకలో పెట్టుకుని ఊరంతా దేవులాడిండట వెనకటికి ఎవడో.. శ్రీశైలం నీళ్లు నీ దగ్గర ఉన్నయి వాడమంటే వాడటం చేతనైత లేదు కానీ.. వాళ్లు కట్టిన ప్రాజెక్టులు, కట్టడానికి పూనుకున్న ప్రాజెక్టులు ఎలాంటి అనుమతులు లేనవి. నీటి కేటాయింపులు లేనివి. రేపు బ్రిజేశ్‌కుమార్ ఫైనల్ అవార్డులో వాళ్లకు కేటాయింపులు ఏ మేరకు జరుగుతాయో ఆ మేరకు వాళ్లు వాళ్ల సిస్టమ్స్‌ను వాడుకుంటరు. ఆ సిస్టమ్‌ను మనం పోయి చేయగలిగేదేం లేదు. కానీ మనకు కేటాయించిన మందమైనా వాడుకునేందుకు సిస్టమ్‌ను మీరెందుకు పెండింగ్‌లో పెట్టినట్టు అని ప్రశ్నించారు.
LIVE: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి @SingireddyBRS మీడియా సమావేశంhttps://t.co/KIy84gr0Cq
— BRS Party (@BRSparty) August 24, 2026