మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని సంగం బండ ( Sangam Banda ) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రైట్ లో లెవెల్ కాల్వకు సోమవారం తెల్లవారుజామున గండి (Canal Breach ) పడింది. పొలంలోకి నీరు ఎక్కువగా రావడంతో దాదాపు 30 ఎకరాల వరకు పంట నష్టం ( Crop Damage ) జరిగినట్లు వర్కూర్ రైతులు వివరించారు. లో లెవెల్ కెనాల్ కాల్వకు గత కొన్ని సంవత్సరాలుగా మరమ్మతులు చేయక నామమాత్రకంగా పెరిగిన తుంగను అక్కడక్కడ తీసి వదిలేస్తున్నారని ఆరోపించారు.

Sangam Banda 1
పూర్తిస్థాయిలో కాలువ పూడిక తీయకపోవడంతో కాల్వలలో చెత్త చెదారం అడ్డుపడడంతో కాల్వ కోతకు గురై గండ్లు పడుతున్నాయని రైతులు వాపోయారు. ఈ విషయాలపై పలుమార్లు సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన ఏ ఒక్కరు పట్టించుకోవడంలేదని, కాలువల వెంబడి బండి తోవలు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాలపై ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గండీలను సరిచేసి సాగునీరు వృధాగా పారకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.