హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ‘బిగ్’ టీవీకి ఏపీ ప్రభుత్వం కానుక ఇచ్చి ంది. ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగించే కార్యక్రమాల రూపకల్పన, ప్రసారానికి రూ.59 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం జీవో ఆర్టీ నంబర్ 665 జారీచేసింది. ‘ప్రవాస మీడియా ఎల్ఎల్పీ- బిగ్ టీవీ)కి రూ.59 లక్షలు విడుదల చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు.
ఆరోపణల వెల్లువ
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనుసన్నల్లో నడిచే ‘బిగ్’ టీవీకి రూ.59 లక్షలు విడుదల చేయడం వివాదాస్పదమవుతున్నది. బిగ్ టీవీ కి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పథకాల ప్రసారం ముసుగులో ఈ నిధులు ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వ వైఖరిపై అక్కడి ప్రతిపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.