తాగునీటికి 10 టీఎంసీలు ఇవ్వండి
వేసవి తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా 10టీఎంసీల జలాలను విడుదల చేయాలని ఏపీ సర్కార్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు)కి తాజాగా ప్రతిపాదననలు సమర్పించింది.
- కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ ఇండెంట్
- 5న త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు
హైదరాబాద్, మే1 (నమస్తే తెలంగాణ) : వేసవి తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా 10టీఎంసీల జలాలను విడుదల చేయాలని ఏపీ సర్కార్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు)కి తాజాగా ప్రతిపాదననలు సమర్పించింది. పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో వేసవి తాగునీటి అవసరాల కోసం చెరువులను నింపాల్సి ఉన్నదని తెలిపింది. ప్రస్తుతం సాగర్‌లో 28.21 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉండగా, అందులో 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ బోర్డును కోరింది. ఈ మేరకు ఏపీ ఈఎన్సీ నర్సింహమూర్తి లేఖ రాశారు. ఏపీ కోరిందే తడువుగా కేఆర్ఎంబీ 5వ తేదీన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. తెలంగాణ సర్కార్‌కు కేఆర్ఎంబీ లేఖ రాసింది. వాస్తవంగా ప్రతి నీటి సంవత్సరం ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగాలను త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది. కానీ, ఈ ఏడాది నీటి వినియోగాలకు సంబంధించి ఇప్పటివరకు బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏ ర్పాటుచేయలేదు. ప్రస్తుతం ఏపీ నీటిని కోరుతూ ఇండెంట్ సమర్పించగానే బోర్డు హడావుడిగా సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఏపీ ఇండెంట్‌పై అభిప్రాయాలు తెలుపాలని, వాటిపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చిస్తామని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

