సూర్యాపేట టౌన్: సోదర బంధానికి చిరునామా.. అన్నా చెల్లెల ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం రాఖీ పర్వదినం సందర్బంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రికి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన మహిళా ప్రజాప్రతినిధులతో పాటు మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంత రం మంత్రికి వేద పండితులు సంప్రదాయ పద్దతిలో ఆశీర్వచనం చేశారు. మంత్రికి రాఖీలు కట్టిన వారిలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండీ సల్మా మస్తాన్లతో పాటు పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాఖీలు కట్టారు.