రాష్ట్రంలో రాక్షస పాలన.. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులు, కేసులు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రశ్నించిన ప్రతిపక్ష బీఆర్ఎస్పై దాడులకు దిగడం, కేసులు బనాయించడం రివాజుగా మారిందని మండిపడ్డారు.
- హామీలు అమలు కోరితే బెదిరింపులు
- అక్కసుతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు : బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రశ్నించిన ప్రతిపక్ష బీఆర్ఎస్పై దాడులకు దిగడం, కేసులు బనాయించడం రివాజుగా మారిందని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రెండున్నరేండ్ల పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లో ఉండాల్సిన యూరియా యాప్‌ల్లోకి తెచ్చిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కిందని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్‌కు ఢిల్లీకి మూటలు మోయడం మీద ఉన్న శ్రద్ధ, కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల మూటలను కొనుగోలు చేయడంపై లేదని దెప్పిపొడిచారు. రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్‌పై ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమని ఖండించారు. తెలంగాణ మాండలికంలో ఎక్కడ సచ్చిండని రాహుల్‌ను ఉద్దేశించి సంబోధించిన కేటీఆర్‌పై కేసు పెట్టిన రేవంత్‌రెడ్డి.. వడ్లకుప్పలపై రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు.. మరి నీపై ఎన్ని కేసులు పెట్టాలి? అని ప్రశ్నించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సావు కోరిన రేవంత్‌రెడ్డిని ఉరితీసినా తప్పులేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

