Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో సగటున నలుగురు పోటీ.. 2,996 వార్డుల్లో..12,993 మంది అభ్యర్థులు బరిలో!
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో సగటున నలుగురు పోటీ.. 2,996 వార్డుల్లో..12,993 మంది అభ్యర్థులు బరిలో!మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో మరో అంకం పూర్తయింది. మంగళవారం మధ్యా హ్నం 3గంటలకే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.
- ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ
- అభ్యర్థుల తుదిజాబితా ప్రకటన
- 2,996 వార్డుల్లో..12,993 మంది అభ్యర్థులు బరిలో
- సాయంత్రం నుంచే ప్రచారం
- 9వ తేదీ సాయంత్రంతో ముగియనున్న ప్రచారం
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో మరో అంకం పూర్తయింది. మంగళవారం మధ్యా హ్నం 3గంటలకే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 12,993 మంది అభ్యర్థు లు బరిలో నిలిచినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థ ల్లో (యూఎల్బీ) 2,996 వార్డులు, డివిజన్ల కు 20,313 మంది అభ్యర్థులు 29,694 నా మినేషన్లు దాఖలు చేశారు. వీటిలో 10,084 నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 19,610 నామినేషన్లు చెల్లుబాటైనవిగా వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గం టలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన అనంతరం 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్టు వెల్లడించారు. దీంతో ప్రతి వార్డులో సగటున నలుగురు అభ్యర్థుల చొప్పున పోటీ పడుతున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్, కార్పొరేషన్లలో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మధ్యే నువ్వా, నేనా? అన్న రీతిలో పోటీ నెలకొన్నది. క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు పార్టీల అ భ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్కు కలిసి రానున్నది. ఇదే విషయం గత నెలలో ముగిసిన పంచాయతీ ఎన్నికల్లోనూ స్పష్టమైంది. 35 శాతానికి పైగా పంచాయతీలను గులాబీ పార్టీ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతున్నందున ‘కారు’ టాప్‌గేరులో దూసుకెళ్తుందని బీఆర్ఎస్ అభ్యర్థులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు
గుర్తుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 2018 నాటి ఉత్తర్వుల ప్ర కారం నిబంధనలను అనుసరించింది. జాతీ య, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కేటాయించిన రిజర్వు గుర్తులే ఉంటాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికాగానే, ఎన్నికల అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు ఫ్రీ సింబ ల్స్ (ఉచిత గుర్తులు) కేటాయించారు. ఒకే గుర్తు కోసం పోటీ ఉన్న చోట డ్రా పద్ధతిని అనుసరించారు. గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు తమ ప్రచార సామగ్రిని సిద్ధం చేసుకుని రంగంలోకి దిగారు. మంగళవారం సా యంత్రం నుంచే అభ్యర్థుల ప్రచారం అధికారికంగా మొదలైంది. పాదయాత్రలు, బైక్ ర్యా లీలు, ఇంటింటి ప్రచారంతో వార్డులు హోరెత్తించారు. ఈ నెల 9 సాయంత్రంతో బహిరంగ ప్రచారానికి తెరపడనున్నది. సమయం తకువగా ఉండటంతో సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారాన్ని మొదలుపెట్టారు.
ఒకే పేరుంటే తండ్రి పేరు తప్పనిసరి
ఎన్నికల నిబంధన 14(4) ప్రకారం, ఒకే క్యాటగిరీలో పోటీ చేస్తున్న ఇద్దరు లేదా అంతకంటే ఎకువ మంది అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉంటే, వారిని వేరుగా గుర్తించేందుకు తండ్రి లేదా భర్త పేరును (ఉదాహరణకు: కుమారుడు/కుమార్తె/భార్య) జత చేయాల్సి ఉంటు ంది. అభ్యర్థుల పేర్ల చివర బిరుదులు లేదా విద్యార్హతలను చేర్చుకోవడానికి అభ్యంతరం లేదని, అయితే అక్షర క్రమం నిర్ణయించేటప్పుడు వీటిని పరిగణనలోకి తీసుకోరు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

