సింగరేణి : పర్యావరణహిత, సుస్థిర మైనింగ్ తో పాటు సంప్రదాయేతర విద్యుత్ రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నందుకు సింగరేణికి ( Singareni) జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ఎనర్షియా ఫౌండేష న్ అవార్డు (Enertia Foundation Award ) దక్కింది. భారత దేశం, దక్షిణాసియాలో సుస్థిర ఇంధన, పునరుద్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న సంస్థలను ఎనర్షియా ఫౌండేషన్ ప్రతీ ఏడాది పురస్కారాలను అందజేస్తుంది.
ఈ ఏడాది ‘ ఇండియాస్ బెస్ట్ అండ్ మోస్ట్ సస్టేనబుల్ కోల్ మైనింగ్ ఆపరేటర్ విత్ రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్’ కేటగిరీలో సింగరేణిని అత్యుత్తమ సంస్థగా ఎంపిక చేసినందుకు గాను సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ బలరామ్ హర్షం (CMD Balaram) ) వ్యక్తం చేశారు. ఈ నెల 20న విశాఖపట్నంలో అవార్డుల ప్రదానం జరుగనుందని అవార్డు కమిటీ జ్యూరీ కన్వీనర్ ఆర్.త్యాగరాజన్ అయ్యర్ పేర్కొన్నారు.
సింగరేణి పర్యావరణహిత చర్యలకు గుర్తింపు: సీఎండీ ఎన్. బలరామ్
ఎనర్షియా వారు ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డు సింగరేణి సంస్థ చేపడుతున్న పర్యావరణహిత చర్యలకు గుర్తింపు వంటిదని సీఎండీ ఎన్. బలరామ్ అన్నారు. సింగరేణి సంస్థ ఈ స్ఫూర్తితో తన పర్యావరణ చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు పోతుందని తెలిపారు.
ఒడిశాలో నైనీ బొగ్గు గనికి అనుబంధంగా పర్యావరణహితంగా 1,600 మెగావాట్ల అత్యాధునిక సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ చేపట్టే ప్రతిపాదన ఉందని సీఎండీ వెల్లడించారు. రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటు, భారీ జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటుకు సన్నాహాలు , కార్బన్ డై యాక్సైడ్ నుంచి మిథనాలు తయారీ తదితర చర్యలతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని వివరించారు.
సింగరేణి సంస్థ ఆరు కోట్ల కు పైగా మొక్కలు నాటడమే కాక వాటిని వనాలుగా పెంచుతోందన్నారు. అలాగే పర్యావరణహిత మైనింగ్ పద్ధతులైన సర్ఫేస్ మైనర్, కంటిన్యూయస్ మైనర్, ఇన్ పిట్ క్రషర్ అండ్ కన్వేర్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను బొగ్గు ఉత్పత్తిలో వినియోగిస్తూ ఆదర్శ కంపెనీగా నిలుస్తోందన్నారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే బాటమ్ యాష్, ఫ్లై యాస్లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ పర్యావరణానికి దోహదపడుతోందని వివరించారు. Prestigious award, Singareni,