మిరుదొడ్డి, మే 10: వారం రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే ఉంటూ ధాన్యాన్ని ఆరపెడుతూ మరో రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో శుక్రవారం చోటుచేసుకున్నది. మిరుదొడ్డికి చెందిన రైతు నేరెండ్ల యాదాగౌడ్ (65)కు మూడెకరాలు ఉండగా, రెండు ఎకరాల్లో వరి, మిగతా ఎకరంలో మ క్క, ఇతర పంట వేశాడు. వరిని కోసి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి తెచ్చాడు. తేమశాతం ఎక్కువ ఉండటంతో సెంటర్ నిర్వాహకులు కొనలేదు. దీంతో కొనుగోలు కేంద్రంలో ధా న్యాన్ని కుప్పపోసి వారం రోజులుగా ఆర పెడుతున్నాడు. శుక్రవారం వర్షం వచ్చే సూచనలు కనిపించడంతో వడ్ల కుప్పపై కవర్లను కప్పి బండరాళ్లను పెట్టాడు. అదే వడ్ల కుప్పపై గుండెపోటుకుగురై కుప్పకూలాడు. దవాఖానకు తీ సుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.