హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్, కమిషనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 29 వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
గత ఏడాది జూలై 4న విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకు దరఖాస్తు చేసుకున్నవారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. దరఖాస్తులను డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్, హైదరాబాద్-500022 పేరిట రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలని తెలిపారు.