ఉపాధి కరువై మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కరీంనగర్లో మరో ఆటోడ్రైవర్ బలికావడం విషాదాన్ని నింపింది. యూనియన్ నాయకు లు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
- కిరాయిల్లేక.. ఖర్చులు ఎల్లక వేదన
- పోషణ భారమై బలవన్మరణం
- సర్కార్ తీరుపై కార్మిక నేతల ఫైర్
- ఇది ప్రభుత్వ హత్యేనని ధ్వజం
కరీంనగర్ తెలంగాణ చౌక్, ఏప్రిల్ 22 : రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కరీంనగర్లో మరో ఆటోడ్రైవర్ బలికావడం విషాదాన్ని నింపింది. యూనియన్ నాయకు లు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌లో కిరాయి ఇంట్లో ఉం టున్న గాండ్ల శ్రీకాంత్(45) జ్యోతిబాఫూలే అడ్డాలో పదిహేనేండ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన తల్లి, భార్య, ఇద్దరు బిడ్డలతో కలిసి ఉంటున్నా డు. ఆటోనే నమ్ముకొని బతుకున్న శ్రీకాంత్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మ హిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినప్పటి నుంచి కిరాయిలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఏడాదికాలంగా మరీ గోస పడుతున్నాడు. రోజువారీ ఖర్చులు కూడా ఎల్లక.. ఇంటి అద్దె, ఇద్దరు ఆడపిల్లల చ దువు, తల్లి పోషణ కు డబ్బుల్లేక ఆం దోళన చెందాడు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. శ్రీకాంత్ మృతదేహానికి కరీంనగర్ ఆటో యూనియన్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ నివాళులర్పించా రు. రాష్ట్రంలో జరుగుతున్న ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ హత్యలేనని ఆ యన విమర్శించారు. శ్రీకాంత్ కుటుంబానికి పది లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు పిల్లల చదువుల ఖర్చును భరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లో తీసుకొచ్చిన ఒక్క రూపాయి అంత్యక్రియల పథకం కింద శ్రీకాంత్ అంత్యక్రియలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

