హైదరాబాద్ : రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto driver) ఆత్మహత్యలు(Commits suicide) కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఉపాధిలేక చేసిన అప్పులు తీర్చలేక ఎంతో మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన ఖమ్మం(Khammam) జిల్లా బోనకల్లు మండలం చొప్పకట్లపాలెం గ్రామంలో చోటు చరేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన అమరబోయిన పాపారావు(32) కొద్ది నెలల క్రితం ఫైనాన్స్‌లో ఆటో కొన్నాడు. నెలకు రూ.10 వేలు కిస్తీ కట్టాల్సి ఉండగా, ఆటో నడవకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. శుక్రవారం రాత్రి 1 గంట సమయంలో ఇంటికి వెళ్లిన పాపారావు.. భార్యతో గొడవ పడి, భార్యాపిల్లల్ని బలవంతంగా బయటకు పంపించాడు. ఆటో స్టార్ట్ చేసే తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పాపారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన అమరబోయిన పాపారావు(32) కొద్ది నెలల క్రితం ఫైనాన్స్ లో ఆటో కొన్నాడు.
నెలకు రూ.10 వేలు కిస్తీ కట్టాల్సి ఉండగా, ఆటో నడవకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు.
శుక్రవారం… pic.twitter.com/CUX9SRmEy9
— Telugu Scribe (@TeluguScribe) October 6, 2024