మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 23, 2020 , 02:34:38

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఆల్‌ మైనార్టీ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మహేశ్వరం, హయత్‌నగర్‌, కాచిగూడ, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌డిపోల వద్ద టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. లాక్‌డౌన్‌ వేళ కోత విధించిన 50 శాతం వేతనాలను, గత సమ్మెకాలంనాటి 12 రోజుల వేతనాలను, ఆర్టీసీ కోఆపరేటివ్‌ సొసైటీకి కలిపి మొత్తం రూ.450 కోట్లను విడుదల చేయడంపై హర్షం ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగులకు అన్నివేళలా అండగా ఉంటున్నారని ఆ సంఘం నేత థామస్‌రెడ్డి కొనియాడారు. సీఎంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు జీపీఆర్‌ రెడ్డి, కమలాకర్‌, యాదయ్య, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.