యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. క్షేత్రానికి పాలకుడిగా విష్ణుపుష్కరిణి చెంత గల గుడిలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు.
వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. లలితాపారాయణము చేసి, ఆంజనేయస్వామివారికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.