T20 World Cup: ఇండోపాక్ మ్యాచ్ జోష్.. ఒక్కసారిగా పెరిగిన విమాన టికెట్ ఛార్జీలు
T20 World Cup: హై వోల్టేజ్ మ్యాచ్కు ఫ్యాన్స్ రెఢీ అవుతున్నారు. ఇండియాతో ఆడేందుకు పాక్ ఓకే చెప్పడంతో.. కొలంబోకు వెళ్లే విమానాలకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. విమాన టికెట్ ఛార్జీలకు క్షణాల్లోనే రెక్కలొచ్చేశాయి.
కొలంబో: టీ20 వరల్డ్కప్(T20 World Cup)లో ఆదివారం భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఆ మ్యాచ్పై ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే.. కొలంబోకు వెళ్లే విమానాలకు టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. ముంబై- కొలంబో మధ్య ఒక్కసారిగా టికెట్ ధరపై పది వేలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన ఆ మ్యాచ్ జరగనున్నది. అయితే తాజా రిపోర్టు ప్రకారం ముంబై-కొలంబో-ముంబై మధ్య విమాన టికెట్ ఛార్జీ 60 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండోపాక్ సమరానికి తగ్గ రీతిలో విమాన ఛార్జీలు కూడా పెరిగినట్లు కొన్ని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్ వివరాల ప్రకారం.. చండీఘడ్ నుంచి కొలంబోకు ఎయిర్ ఇండియా రౌండ్ ట్రిప్ సుమారు 63 వేలు ఉన్నది. ఇక ఇండిగో విమాన ఛార్జీలు సుమారు 70 నుంచి 74 వేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ-కొలంబో మధ్య ఆ తేదీల్లో విమాన ఛార్జీలు 45 వేలుగా ఉన్నట్లు బుకింగ్ డిటేల్స్ ద్వారా స్పష్టమవుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Colombo
- flight fares
- India
- Pakistan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

