Congress MLAs | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో తిరుగుబాటు కుంపటి మరింత రాజుకుంటున్నది. శుక్రవారం రహస్యంగా సాగిన ఈ వ్యవహారం ఆదివారం బ హిరంగంగా మారిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలం సమావేశమైన మాట వాస్తవమేనని రహస్య భేటీలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అంగీకరించారు. ఎమ్మె ల్యే ఫండ్స్ విషయం మాట్లాడుకోవాలని భావించామని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీతో చర్చలు జరిపిన తరువాత అన్ని విషయాలు చెప్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. కాంగ్రెస్‌లో కుంపటి సెగ అటు అధిష్ఠానాన్ని కూడా తాకింది.
పది మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దని, యుద్ధప్రాతిపదికన జోక్యం చేసుకోవాలని హైకమాం డ్ నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల, పొన్నం, ఉత్తమ్, పొంగులేటి శనివారం కమాండ్ కం ట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేల రహస్యభేటీపై సుదీర్ఘంగా చర్చించారనే విస్తృత ప్రచారం జరుగుతున్నది.
ఒకవైపు మంత్రుల సమావేశం జరుగుతుండగానే, మ రోవైపు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి మా ట్లాడుతూ.. పది మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ ఏమీ కాదని, ఒక ఎమ్మెల్యే డిన్నర్ ఇచ్చారని, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని చెప్పారు. అంతేకాకుండా, ఆ భేటీని ‘టీ కప్పులో తుఫాన్’గా అభివర్ణించారు. ఒక పని గురించి వారు చర్చించుకున్నారని, అం దులో పెద్దగా తప్పు పట్టాల్సింది లేదని చెప్పా రు. కాగా, ఇప్పటికే సీఎంకు, ఒకరిద్దరు మం త్రులకు, జిల్లా ఇన్చార్జి మంత్రులకు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలకు మధ్య పొసగడంలేదనే ప్రచారం జరుగుతున్నది.
వీటికితోడు ఎమ్మెల్యేల రహస్యభేటీ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. రసహ్య భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలతో ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మ హేశ్‌కుమార్‌గౌడ్ ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దని, ఏమైనా ఉంటే పార్టీ వేదికగా మాట్లాడుకుందామని చెప్పారు. మరో ఇద్దరు మంత్రులు కూడా రంగంలోకి దిగి సమావేశానికి వెళ్లిన వారితో మాట్లాడారు. పార్టీ ముఖ్యనేతలు మాట్లాడటంతో భేటీకి వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా తాము సాధారణంగానే కలుస్తామని, ఇదేమీ పార్టీపై తిరుగుబాటు కాదని, ఎవరికీ వ్యతిరేకంగా తాము లేమని చెప్తున్నారు.
ఎమ్మెల్యేల రహస్య భేటీపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్టు సమాచారం. ఈ అంశాన్ని తేలికగా తీసుకోవద్దని, యుద్ధప్రాతిపదికన జోక్యం చే సుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇం దులో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు, మంత్రు లు జోక్యం చేసుకున్నట్టు సమాచారం. దీంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ వద్దకు ఈ అంశం చేరినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో ఆమె కూడా హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల భేటీలో కీలకంగా వ్యవహరించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆదివారం ఒక మీడి యా చానల్‌తో మాట్లాడుతూ.. తమ పార్టీ ఇన్చార్జి దీపాదాస్మున్షీతో సమావేశమవుతామ ని చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యేల భేటీ పెద్ద విషయం కాదంటూనే, దీపాదాస్మున్షీ వద్ద సమస్యలు చెప్పుకుంటామని అనడంపై పా ర్టీలో చర్చ జరుగుతున్నది. రహస్యభేటీలో ఇప్పటివరకు తెరపైకిరాని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తనకూ ‘మెసేజ్’ వచ్చిందని, కానీ దానిని తాను చూసుకోలేదని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో ‘అసలేం’ జరుగుతున్నదనే చర్చ సాగుతున్నది.
రహస్యభేటీ ఏమీ కాదు. మంత్రులకు ఎక్కువ ఫండ్స్ వస్తున్నయ్. వారి నియోజకవర్గాలు బాగైతున్నయ్. మా నియోజకవర్గాలు కూడా బాగుపడ్తయ ని అనుకున్నం. ఇందుకోసమే అంద రం కలిసి మాట్లాడుకుందమని కూర్చు న్నం. కానీ, అది మార్నింగ్ వరకు వేరే లా వచ్చేసింది. కూర్చున్నది మాత్రం వాస్తవం. మా సీఎం మాట్లాడదాం అ న్నరు. దీపాదాస్మున్షీ రేపు వస్తున్నరు. వారితో చర్చించిన తర్వాత ఏం జరిగిందో చెప్తం.
స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతు న్న నేపథ్యంలో మా ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకుంటే తప్పేమిటి? నాకు కూ డా మెసేజ్ పంపిండ్లు. నేను చూసుకోలేదు. అయినా, మా వాళ్లు ఏవైనా, బీజేపీవాళ్లతో, బీఆర్ఎస్ వాళ్లతో కలిసి మీటింగ్ పెట్టుకున్నరా? ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మీటింగ్ పెట్టుకున్న రా? మాకో అధిష్ఠానం ఉంటది. సీఎం ఉంటరు. మాట్లాడుకుంటం. దీనికి ఏదో జరిగిందని క్రియేట్ చేయడం ఏమిటి? కొన్ని యూట్యూబ్ చానళ్లు, పత్రికలు పనిగట్టుకొని రాస్తున్నాయి.