న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం అంగన్వాడీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట సిబ్బందితో కలిసి ధర్నా నిర్వహించారు.
భద్రాద్రి జిల్లా వ్యాప్తం గా సోమవారం అంగన్వాడీలు ధర్నాలు, ఆందోళన చేపట్టారు. అశ్వారావుపేట, చర్ల, దుమ్ముగూడెం, టేకులపల్లి, ఇల్లెందు, మణుగూరు మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. కామారెడ్డిలో అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు.