హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ టీచర్లకు పది నెలలుగా వేతనాలు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ (టీఏటీఏ) కదం తొక్కాలని నిర్ణయించింది. టీఏటీఏ నేతృత్వంలో ఈ నెల 17, 18వ తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని కార్యాచరణ ప్రకటించారు. అందులో భాగంగా 48 గంటల పాటు కలెక్టరేట్ల వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీఏటీఏ (సీఐటీయూ) రాష్ట్ర నాయకురాలు సునీత వెల్లడించారు. ఈ మేరకు మంత్రి సీతక్కతో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు అందజేయనున్నట్టు ఆమె తెలిపారు.
లెక్కలేసి.. పక్కకు పెట్టి
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంగన్వాడీలకు కష్టాలు మొదలయ్యాయి. వాటిలో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అంగన్వాడీలకు రూ.18,000 వేతనం చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అప్పుడు పీసీసీ హోదాలో హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. అలాగే రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్లకు ఇస్తామన్న బెనిఫిట్స్ కూడా అమలుకు నోచుకోలేదు. అందుకోసం రూ.50 కోట్లు అవసరమని లెక్కలు వేశాక సంబంధిత ఫైలును పక్కన పెట్టేశారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్ల సాధనకు ధర్నా చేయాలని నిర్ణయించారు. డిమాండ్లు నెరవేర్చేదాకా ఉద్యమం ఆగదని కాంగ్రెస్ సర్కారును ఆ సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు.
అంగన్వాడీల డిమాండ్లలో కొన్ని..