తెలంగాణకు ఏపీ రూ.408 కోట్ల బకాయిలు
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లోని ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను తిరిగి చెల్లించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లోని ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను తిరిగి చెల్లించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఉమ్మడి హైకోర్టు, రాజ్‌భవన్ లాంటి రాజ్యాంగబద్ధమైన ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.408.48 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు.
ఈ బకాయిలను వడ్డీ సహా చెల్లించాలని కోరుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2022 జూలై 5న లేఖ రాసిందని, దీంతో ఆ వివాదాన్ని పరిషరించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పలు సమావేశాలు జరిగాయని, ఖర్చుల వివరాలను సరిచూసుకోవాలని 2025 ఫిబ్రవరి 3న జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు సూచించిందని వివరించారు. ఆ అకౌంట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తాజాగా కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్)కు లేఖ రాసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఏపీ ఆర్థికశాఖ, పబ్లిక్ వర్స్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఆ గణాంకాలను సరిచూసే బాధ్యతను తీసుకున్నట్టు ‘కాగ్’ కార్యాలయం గత నెల 8న లేఖ ద్వారా వెల్లడించిందని, దీంతో ఆ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రెండు రాష్ట్రాల అకౌంటెంట్ జనరల్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని పంకజ్ చౌదరి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

