హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : కొండగట్టులో టీటీడీ నిర్మిస్తున్న భక్తుల వసతిగృహ శిలాఫలకాల విషయం లో ఏపీ ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నదని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. శిలాఫలకాలపై టీటీడీకి సంబంధం లేని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పే రు పెడతామంటున్నారని అసంతృప్తిని వ్యక్తంచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఆమె చిట్‌చాట్ చే శారు. కొండగట్టులో రెండు శిలాఫలకాలు ఏర్పాటుచేసి ఒకదానిపై తెలంగాణ, మరోదానిపై ఏపీ వాళ్ల పేర్లు పెడితే అభ్యంతరం లేదని ప్రకటించారు.
ధూపదీప నైవేద్యం పథకంపై ఆడిట్ జరుగుతున్నదని, త్వరలో చాలామందిపై వేటు పడుతుందని మంత్రి వెల్లడించారు. యాదాద్రి బోర్డు ఫైల్ సీఎం దగ్గర ఉందని, ఆయనే నిర్ణయం తీసుకుంటారని, మేడా రం పనులన్నీ మంత్రులు సీతక్క, పొంగులేటే చూస్తున్నారని, తన శాఖలకే తాను ప రిమితమవుతున్నానని మంత్రి తెలిపారు.
రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ తనను, సీతక్కను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని సురేఖ చెప్పారు. మేడారం జాతరకు ఆ హ్వానించడానికి వెళ్లగా ఆప్యాయంగా స్వా గతించారని, తమ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు. జాతరకు తప్పక వస్తామన్నారని, పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు.