ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం.. కరీంనగర్ శివారులో ఘటన
కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది.
- డ్రైవర్ అప్రమత్తతతో 40 మంది సురక్షితం
తిమ్మాపూర్, జూన్ 21: కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ కరీంనగర్-2 డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ప్రయాణికులతో హైదరాబాద్ జేబీఎస్‌కు బయలుదేరింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ శివారులో కాకతీయ కాలువ దాటిన తర్వాత బస్సులో కాలిపోతు న్న వాసనతోపాటు సిగ్నల్స్ రావడంతో డ్రైవర్ ప్రశాంత్ అప్రమత్తమై రాజీవ్ రహదారి పక్కన బస్సును నిలిపివేశాడు. బస్సులో ఉన్నవారిని అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు హుటాహుటిన కిందికి దిగారు.
బస్సులో ఉన్న అగ్నిమాపక పరికరాన్ని ఉపయోగించి మం టలు ఆర్పేందుకు డ్రైవర్ యత్నించినా.. అదుపులోకి రాలేదు. పరిస్థితి చేయి దాటిపోతుంద ని భావించిన డ్రైవర్ ప్రయాణికుల లగేజీ బ యటకు విసిరి దిగాడు. మంటలు చెలరేగగా.. అర గంటలోనే బస్సు మొత్తం కాలి బూడిదైపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే భారీ ప్రాణనష్టం వాటిల్లేదని ప్రయాణికులు చెబుతున్నారు. సమాచారం అందిన 40 నిమిషాల తర్వాత ఫైర్ ఇంజిన్ రావడంతో అప్పటికే బ స్సు మొత్తం దగ్ధమైంది. ఘటనాస్థలాన్ని పోలీ స్, అగ్నిమాపక, రవాణా, ఆర్టీసీ శాఖల అధికారులు సందర్శించారు. బస్సు బ్యాటరీలు పేలాయా? షార్ట్‌సర్క్యూట్ జరిగిందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

