గద్వాల, ఆగస్టు 6 : వ్యవసాయం తర్వాత ఎక్కు వ శాతం ప్రజలకు జీవనోపాధిగా మారిన వృత్తి చే నేత. కర్ని, సాలే, దూదేకుల, రజక, మైనార్టీ కులా ల్లో మెజార్టీగా చేనేత వృత్తిని ఆసరాగా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో చేనేత రంగంపై ఆధారపడి ఉండే చేనేత రంగానికి భరోసా కరువైంది. చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు ప్రభుత్వ తోడ్పాటు కోసం ఎ దురు చూస్తున్నారు. గద్వాల జరీ చీరలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా గాక విదేశాల్లో సైతం గద్వాల చీరకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.
గద్వాల డివిజన్లో గద్వాల, అనంతపురం, కుర్వపల్లి, కాకులారం, ధరూర్, గట్టు, మాచర్ల, ఆరగిద్ద, గొర్లఖాన్‌దొడ్డి, మల్దకల్, బూడిదపాడు, నాగర్‌దొడ్డి, అలంపూర్, రాజోళి, ఎక్లాస్పురం, అయిజ ప్రాంతాలలో దాదాపు 6,948 కు పైగా కుటుంబాలు చేనే త వృత్తిపై పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధిని పొం దుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూతనివ్వడంతో కార్మికులు తమ పూర్వ వృత్తి వైపు తిరిగి వచ్చి చీరలు నేస్తూ ఉపాధి పొందుతున్నా రు.
గద్వాల చేనేత కార్మికులకు సాం కేతికతను ఉపయోగించి విభిన్నమైన డిజనైన్లను, వి నూత్న వివిధ రకాల డిజైనింగ్ విభాగంలో జో గుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు చేనేత కార్మికులు గత ప్రభుత్వంలో కొండా లక్ష్మణ్ బా పూజీ అవార్డులకు ఎంపిక కావడం చూస్తుంటే ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యం ఎలాంటిదో తెలిసిపోతుంది. ఒక నాడు సడుగులు విరిగిన సాలే మగ్గం గత బీ ఆర్ఎస్ ప్రభుత్వం చేయూతతో పూ ర్వవైభవం సంతరించుకున్నది. అందుకు కారణం గత ప్రభు త్వం చేనేత కార్మికుల కోసం చేనేత బీమా, త్రిఫ్ట్ పథకం, చేనేత కార్మికుల కోసం విదేశీ విద్యానిధి పథకం.. ఇలా అనేక సౌకర్యాలు ప్రభు త్వం కల్పిస్తుండడంతో వారు ఉపాధి పొందడంతోపాటు కనుమరుగువుతున్న చేనేత వృత్తిని కాపాడుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చేనేత కార్మికులకు చేయూత కరువైంది. వారికి చేయూత నిచ్చేవారు లేకపోవడం తో కార్మికులు అవస్థలు పడుతున్నారు.
గతమెంతో ఘనం
గద్వాల చీరలకు దాదాపు 300 ఏండ్లు దాటాయని చరిత్ర చెబుతోంది. గద్వాల జరీ చీరల స్థా నం సుస్థిరం. జరీ చీరల ప్రస్థానం ఈ నాటిదికా దు. సంస్థానాధీశుల కాలంలోనే గద్వాల చేనేత కు ప్రత్యేకత ఉన్నది. నాటి రాజుల ప్రోత్సాహం తో ప్రపంచ ఖ్యాతిని దక్కించుకున్నది. అగ్గిపెట్టెలో పట్టుచీర మలచిన అద్భుత కళానైపుణ్యం మన నేతన్న సొంతం. నేతన్నలు నేచిన చీరలకు ఎల్లలు దాటిన ప్రాశస్త్యం. గత ప్రభుత్వాలు నేతన్నలను పట్టించుకోకపోవడంతో పాటు ప్రస్తుత యాంత్రిక ప్రపంచంలో హస్తకళలకు ప్రోత్సాహం కరువు కా వడంతో నేతన్నలు ఇతర పనులపై దృష్టి పెట్టారు. గత తెలంగాణ ప్రభుత్వంలో నేతన్నకు మంచి రోజులు వచ్చాయి.
సడుగులు విరుగుతున్న మగ్గం
చేనేత కార్మికుల ఆర్థిక తోడ్పాటు కోసం 2025 మార్చిలో ప్రారంభమైన త్రిఫ్ట్ ఫండ్ పథకంలో అత్యంత కీలకమైన ఆర్డీ-2 సొమ్మును కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నా రు. 14 నెల లుగా కా ర్మికుల ఖాతాల్లో ప్రభు త్వం సొమ్ము జమచేయ క పోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నా రు. దీంతో పాటు నేతన్న భ రోసా పేరుతో ప్రతి కార్మికుడికి ఏడాదికి ఒక సారి రూ. 24 వేలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, నాలుగు విడుతలుగా అందిస్తామని చెప్పి అధికారం చేపట్టిన తర్వాత ఒక విడుత మాత్రమే జమ చేసి ప్రభు త్వం చేతులు దులుపుకొన్నది.
మిగ తా విడుతల కో సం చేనేత కార్మికులు ఎదురు చూస్తున్నారు. రుణమాఫీలో భాగంగా కేబీఎస్ బ్యాంక్‌లో రుణాలు పొందిన అయిజ వారికి మాత్రం రుణమాఫీ వర్తించలేదు. ఈ బ్యాంక్ పరిధిలో 70 మంది చేనేత కార్మికులకు రుణాలు ఉండగా ఆ సొమ్ము రూ.50 లక్షల వరకు ఉ ంటుందని కార్మికులు చెబుతున్నారు. తమకు రుణమాఫీ చేయాలని కార్మికులు కోరుతున్నా రు. బీఆర్ఎస్ హయాంలో చేనేత ఘనంగా ఉండగా ప్రస్తుతం ఆధ్వానంగా తయారైంది.