ఏఐ పూయించిన మైదాకు
భారతీయ వివాహాలు అంటేనే రంగులు, హడావుడి. పెండ్లిపీటలు ఎకే సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక విషయంలో చిన్నపాటి ఆందోళన కలగడం సహజమే. కానీ, జైపూర్‌లో జరిగిన ఒక పెండ్లిలో మాత్రం అప్పటికప్పుడు ఎదురైన సమస్యను పరిషరించడానికి ఆధునిక సాంకేతికత అండగా నిలిచింది.
భారతీయ వివాహాలు అంటేనే రంగులు, హడావుడి. పెండ్లిపీటలు ఎకే సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక విషయంలో చిన్నపాటి ఆందోళన కలగడం సహజమే. కానీ, జైపూర్‌లో జరిగిన ఒక పెండ్లిలో మాత్రం అప్పటికప్పుడు ఎదురైన సమస్యను పరిషరించడానికి ఆధునిక సాంకేతికత అండగా నిలిచింది. సంప్రదాయ వేడుకలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించి, ఒక సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది. ముంబైకి చెందిన కంటెంట్ స్ట్రాటెజిస్ట్ అనూషా జైన్ వివాహం సందర్భంగా.. పెండ్లికి ముందు రోజు జరిగే మెహెందీ వేడుక సమయానికి అతిథుల రాకతో ఇల్లంతా కోలాహలంగా మారింది.
రొటీన్ డిజైన్లు కాకుండా ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నప్పటికీ, బిజీ షెడ్యూల్ వల్ల ఎలాంటి డిజైన్‌ను ఎంచుకోలేకపోవడంతో, సరిగ్గా మెహెందీ ఆర్టిస్ట్ చేతిలో గోరింటాకు శంఖం పట్టుకుని ‘ఏ డిజైన్ వేయమంటారు?’ అని అడిగేసరికి అనూషా ఒకసారిగా కంగారుపడ్డది. ఆ క్లిష్ట సమయంలో ఆమె సోదరుడు చాట్‌జీపీటీ సహాయం తీసుకోమని ఇచ్చిన ఐడియా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సరదాగా ప్రారంభించిన ఆ ప్రయత్నం క్షణాల్లోనే అద్భుతాన్ని ఆవిషరించింది. తన సొంత ఊరు, భర్త ఊరు, ఇద్దరికీ ఉన్న ఆహారప్రియాత్వం, వారి వివాహ థీమ్ ‘అరౌండ్ ద వరల్డ్’ లాంటి వివరాలను టూల్లో నమోదు చేశారు. కొద్ది సెకన్లలోనే వారి ప్రేమ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా వినూత్న ఆలోచనలను ఏఐ అందించింది.
వధువు ఊరు ముంబైకి గుర్తుగా ఆటో-రిక్షా, వరుడి ఊరు జైపూర్ రాజసానికి ప్రతీకగా ఏనుగు, నిరంతర ప్రయాణాలకు గుర్తుగా ముంబై ఎయిర్ పోర్ట్, అలాగే అరచేతి మధ్యలో ఇరు కుటుంబాల పేర్లతో క్రాస్ వర్డ్ పజిల్ వంటి ప్రతిపాదనలను ఏఐ అందించింది. అయితే, సాంకేతికత అందించిన ఆలోచనకు ప్రాణం పోసింది మాత్రం మెహెందీ ఆర్టిస్ట్ నైపుణ్యమే. ఏఐ అందించిన కాన్సెప్ట్‌ను ఆర్టిస్ట్ తన నైపుణ్యంతో వేసిన ఆ కళాఖండం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ కావడమే కాకుండా, చాట్‌జీపీటీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలోనూ చోటు దకించుకుంది. సాంకేతిక పరిజ్ఞానం కేవలం ఆఫీసు పనులకే కాకుండా, జీవితంలో మరచిపోలేని ప్రత్యేక ఘట్టాల్లోనూ భాగమవుతుందని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

