సెప్టెంబర్ 5న భారత్-పాక్ పోరు
చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లు మరోసారి అభిమానులను అలరించనున్నాయి. మహిళల టీ20 ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 5న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నెల 28న మొదలయ్యే ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గురువారం ప్రకటించింది.
- ఈ నుంచి మహిళల టీ20 ఆసియాకప్
దుబాయ్: చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లు మరోసారి అభిమానులను అలరించనున్నాయి. మహిళల టీ20 ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 5న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నెల 28న మొదలయ్యే ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గురువారం ప్రకటించింది. యుఏఈ వేదికగా సెప్టెంబర్ 13 వరకు ఎనిమిది జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది.
28న ఆరంభ మ్యాచ్‌లో హాంకాంగ్, థాయ్‌లాండ్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొంటున్న జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-ఎలో ఏడుసార్లు చాంపియన్ భారత్‌తో పాటు పాక్, థాయ్‌లాండ్, హాంకాంగ్, చైనా ఉండగా.. డిఫెండింగ్ చాంప్ శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచే జట్లు సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్‌కు చేరుతాయి. సెప్టెంబర్ 13న ఫైనల్ జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

