యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భువనగిరి(Bhuvanagiri) బాలసదన్‌లో(Balasadan) ఓ అధికారి పదేళ్ల బాలికపై లైంగిక దాడికి(Girl assaulted) యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే..లీగల్ సర్వీసెస్ అటెండర్ వెంకట్ రెడ్డి పదేళ్ల బాలికను లైంగికంగా వేధించాడు. గమనించిన బాలసదన్ సిబ్బంది వెంకటర్రెడ్డిపై భువనగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే సదన్ సిబ్బందిని సూపరింటెండెంట్ బెదిరించినట్లు సమాచారం. విషయం బయటకు రావొద్దని సిబ్బందిని బెదిరింపులకు పాల్పడినట్లు సిబ్బంది ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | పోలీసు అమరుల త్యాగాలను జాతి ఎన్నటికీ మరువదు: కేటీఆర్
KTR | రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది: కేటీఆర్
Group-1 Mains | భారీ బందోబస్తు నడుమ.. నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు