హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13(నమస్తే తెలంగాణ)/నారాయణపేట : హైదరాబాద్ సీసీఎస్, నారాయణపేట జిల్లా మద్దూర్‌లో న మోదైన కేసులపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఎనిమిది మందితో సిట్ వేస్తూ డీజీ పీ శివధర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలను అసభ్యంగా రూ పొందించి కావలి వెంకటేశ్ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారని కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఫిర్యాదు మేరకు మద్దూరులో ఈ నెల 11న కేసు నమోదైంది.
మహిళా ఐఏఎస్, మంత్రిపై కథనాలను ప్రసారం చేయడంపై ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులపై సిట్ దర్యాప్తు చేయనున్నది. సభ్యులుగా నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్‌బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్, సీసీఎస్ ఏసీపీ గురురాఘవేంద్ర, సైబర్‌సెల్ ఇన్స్పెక్టర్ శంకర్‌రెడ్డి, సైబర్‌సెల్ ఎస్సై హరీశ్ ఉన్నారు.